LOADING...
Bomb In Flight: ప్రయాణంలో ఉండగా విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో కువైట్-హైదరాబాద్ విమానం ముంబైకి మళ్లింపు
ఇండిగో కువైట్-హైదరాబాద్ విమానం ముంబైకి మళ్లింపు

Bomb In Flight: ప్రయాణంలో ఉండగా విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో కువైట్-హైదరాబాద్ విమానం ముంబైకి మళ్లింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవ‌ల అంత‌ర్జాతీయ విమానాల‌కు బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళ‌న కలిగిస్తున్న నేపథ్యంలో, తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాల్సిన ఇండిగో విమానానికి (ఫ్లైట్ నంబర్‌ 6E 1234) బాంబు హెచ్చరిక ఈ-మెయిల్ రూపంలో అందడం తీవ్ర కలకలం సృష్టించింది. అర్ధరాత్రి 1:30 గంటలకు కువైట్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఉదయం 8:10 గంటల సమయంలో హైదరాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉండగా, ప్రయాణంలోనే సిబ్బందికి బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రమాదాన్ని ఏమాత్రం తలెత్తనీయకుండా ముందస్తు భద్రతా చర్యల భాగంగా విమానాన్ని హైదరాబాద్‌కు రావడానికి అనుమతించకుండా, తక్షణమే ముంబై విమానాశ్రయానికి మళ్లించారు.

వివరాలు 

ఆందోళనలో ప్రయాణికులు 

అయితే విమానం దారి మళ్లించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం అది ఇప్పటివరకు ముంబైలో ల్యాండ్ కాలేదు. ఈ అనూహ్య పరిణామంతో విమానంలో ఉన్న పైలట్‌తో పాటు ప్రయాణికులంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. పరిస్థితి ఏంటో స్పష్టత లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ ఘటనపై శంషాబాద్‌తో పాటు ముంబై విమానాశ్రయాల అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత భద్రతా దళాలు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు.

Advertisement