Loading...
Indiramma Indlu - CURE: క్యూఆర్‌లో ఇందిరమ్మ ఫ్లాట్లకు అర్హులేనా? ఇలా చెక్‌ చేసుకోండి
క్యూఆర్‌లో ఇందిరమ్మ ఫ్లాట్లకు అర్హులేనా? ఇలా చెక్‌ చేసుకోండి

Indiramma Indlu - CURE: క్యూఆర్‌లో ఇందిరమ్మ ఫ్లాట్లకు అర్హులేనా? ఇలా చెక్‌ చేసుకోండి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
05:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్‌ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు కీలక సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫ్లాట్లకు అర్హత సాధించిన దరఖాస్తుదారుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. దరఖాస్తుదారులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చు. ఒకవేళ అర్హత పొందకపోతే.. అందుకు కారణాలను తెలుసుకుని, వివరాలు తప్పుగా ఉంటే అభ్యంతరం కూడా వ్యక్తం చేయవచ్చు.

వివరాలు 

7,340 ఇళ్లకు 60,720 దరఖాస్తులు

క్యూఆర్‌ పరిధిలో నిర్మించనున్న 7,340 ఇళ్లకు మొత్తం 60,720 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

దరఖాస్తుదారుల ఆస్తులు, వాహనాలు, స్థలం, సొంత ఇల్లు తదితర వివరాలను అధికారులు పరిశీలించారు.

ఈ తనిఖీల అనంతరం దాదాపు 40 వేల మంది దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించారు.

దరఖాస్తుదారులు తమ అప్లికేషన్‌ స్టేటస్‌ను తెలంగాణ హౌసింగ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ tghb.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అర్హతకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే అదే వెబ్‌సైట్‌లో తెలియజేసే అవకాశం కూడా కల్పించారు.

వివరాలు 

అప్లికేషన్‌ స్టేటస్‌ ఎలా చెక్‌ చేసుకోవాలి?

ముందుగా tghb.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

అక్కడ అప్లికేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మీకు సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

ఆ తర్వాత పక్కనే ఉన్న బాక్స్‌లో సంబంధిత అప్లికేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌ లేదా ఆధార్‌ వివరాలను నమోదు చేసి 'Search' బటన్‌పై క్లిక్‌ చేయాలి.

దీంతో మీ అప్లికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

అందులో అప్లికేషన్‌ నంబర్‌, దరఖాస్తుదారు పేరు, ప్రాజెక్టు లొకాలిటీ, అప్లికేషన్‌ స్టేటస్‌, క్లెయిమ్‌ ఆప్షన్లు ఉంటాయి. మీరు అర్హత సాధించకపోతే స్టేటస్‌లో 'Ineligible' అని చూపిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు 

అనర్హతకు కారణం ఎలా తెలుసుకోవాలి?

మీ అప్లికేషన్‌ 'Ineligible'గా ఉంటే.. దాని పక్కనే ఎరుపు రంగు బాక్స్‌లో 'Raise Claim' అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.

దానిపై క్లిక్‌ చేస్తే మీరు ఎందుకు అనర్హులుగా గుర్తించబడ్డారో వివరాలు తెలుసుకోవచ్చు.

అధికారులు నమోదు చేసిన వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నాయని మీరు భావిస్తే.. వాటిపై అదే పేజీలో అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు.

ఇందుకోసం ఇచ్చిన బాక్స్‌లో వివరాలు తప్పుగా ఉన్న కారణాన్ని స్పష్టంగా నమోదు చేయాలి.

అవసరమైతే మీ వాదనకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను కూడా అక్కడే అప్‌లోడ్‌ చేయవచ్చు.

ADVERTISEMENT

వివరాలు 

ఆగస్టు 23లోపు అభ్యంతరాలు

అర్హుల జాబితాపై అభ్యంతరాలు ఉన్న దరఖాస్తుదారులు ఆగస్టు 23 సాయంత్రంలోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ తెలిపారు.

వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం లాటరీకి అర్హత సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఆగస్టు 25న ప్రకటించనున్నారు.

ఆగస్టు 27 నుంచి 30 వరకు లాటరీ నిర్వహించి అర్హత సాధించిన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించనున్నారు.

ఇందిరమ్మ ఫ్లాట్ల దరఖాస్తుకు సంబంధించి మరిన్ని వివరాలు లేదా సందేహాలు ఉంటే 040-24603572 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT