Loading...
Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు
పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు

Andhra Pradesh: పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు చెరగని సిరా గుర్తు వేసే విధానంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఓటరికి ఎడమచేతి చిటికెన వేలుపై సిరా గుర్తు వేయాలని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఓటర్ల ఎడమచేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు.

వివరాలు 

ఓటర్ల ఎడమచేతి మధ్య వేలుపై కూడా సిరా గుర్తు

అయితే, పోలింగ్‌లో చోటుచేసుకున్న మార్పులు, రీపోలింగ్ నిర్వహణ కారణంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల ఎడమచేతి మధ్య వేలుపై కూడా సిరా గుర్తు వేయాలని అధికారులు ఆదేశించారు.

ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వేసిన సిరా గుర్తులు కొంతమంది ఓటర్ల వేళ్లపై ఇంకా చెరిగిపోకుండా ఉన్నాయి.

దీంతో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా గుర్తు వేయాలని అధికారులను ఆదేశించింది.

ADVERTISEMENT