LOADING...
Telangana: జూన్‌ 8 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం.. విద్యార్థులకు కీలక సూచనలు
జూన్‌ 8 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం.. విద్యార్థులకు కీలక సూచనలు

Telangana: జూన్‌ 8 నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం.. విద్యార్థులకు కీలక సూచనలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ సోమవారం అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు. ప్రకటన ప్రకారం ఈ నెల 31 వరకు విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానుండగా, తొలి విడత అడ్మిషన్లు జూన్ 30తో ముగుస్తాయి. అలాగే ప్రవేశాల కోసం విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

వివరాలు

మత్తు పదార్థాలను ఆరికట్టేందుకు కీలక నిర్ణయం

ఇక పారదర్శకత కోసం ప్రతి కళాశాల యాజమాన్యం ప్రవేశ ద్వారం వద్ద స్పష్టంగా కనిపించే విధంగా మొత్తం సెక్షన్లు, అందుబాటులో ఉన్న సీట్లు, ఇప్పటికే భర్తీ అయిన సీట్లు, ఇంకా ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను బోర్డుపై ప్రదర్శించాల్సి ఉంటుంది. అదనంగా, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రవేశాల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి "మత్తు పదార్థాలు వినియోగించబోము, విక్రయించబోము" అనే యాంటీ డ్రగ్ అఫిడవిట్‌ను తప్పనిసరిగా పొందాలని నిబంధనల్లో పేర్కొన్నారు.

Advertisement