LOADING...
CII summit: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!
ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!

CII summit: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ సదస్సులో ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. గడిచిన 18 నెలల కాలంలో మొత్తం రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీసిటీలో ఏర్పాటు చేసిన కొత్త యూనిట్లను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం 12 ప్రాజెక్టుల కోసం వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా 12,365 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఒక స్పష్టమైన ప్రణాళికతో శ్రీసిటీని అభివృద్ధి చేశాం. ఇది ఇప్పుడు దేశంలోని అత్యుత్తమ అభివృద్ధి నమూనాగా నిలుస్తోంది.

Details

త్వరలోనే శ్రీసిటి ద్వారా 1.5లక్షల ఉద్యోగాలు

ఇక్కడ నుంచే డైకిన్‌, ఇసుజూ, క్యాడ్బరీ వంటి ప్రపంచ బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపిస్తున్నాయి. మరిన్ని దేశాల పరిశ్రమలను శ్రీసిటీకి ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే శ్రీసిటీకి 6,000 ఎకరాల భూమిని అదనంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. భవిష్యత్తులో 50 దేశాలకు చెందిన కంపెనీలు శ్రీసిటీ నుంచే కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి తీసుకెళ్తామని తెలిపారు. అతి త్వరలోనే శ్రీసిటీ 1.5 లక్షల ఉద్యోగాల కేంద్రంగా మారుతుంది. 2028 నాటికి దీన్ని దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతాం. పెట్టుబడులు, ఉపాధి సృష్టి కోసం భారీ స్థాయి ప్రణాళికలపై ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు.