NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?
    భారతదేశం

    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?

    వ్రాసిన వారు Naveen Stalin
    May 21, 2023 | 01:02 pm 0 నిమి చదవండి
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?

    ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల ప్రజల దశాబ్దాల డిమాండ్ నెరవేరింది. జీఓ నంబర్ 111ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జీవోను రద్దు చేయడం ద్వారా తెలంగాణలో మరో నగర నిర్మాణానికి ప్రభుత్వం నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌‍ పరివాహక ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో అనుచిత పారిశ్రామికీకరణ, భారీ నిర్మాణ కార్యకలాపాలు, కాలుష్యాన్ని నిరోధించేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో జీఓ నంబర్ 111ను జారీ చేసింది. కేవలం వ్యవసాయానికే 84గ్రామాల్లోని భూములను వినియోగించాలని జీఓ 111 చెప్పడంతో చాలా ఏళ్ల పాటు ఆ ప్రాంత ప్రజలు దీన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

    84 గ్రామాల్లో 1.32 లక్షల ఎకరాల భూములు

    గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని శంషాబాద్‌ రెవెన్యూ మండలాల్లో గల 84గ్రామాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ పరివాహక ప్రాంతం పరిధిలోకి వస్తాయి. మొత్తం ఏడు మండలాలకు జీఓ 111 వర్తిస్తుంది. అందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, రాజేంద్రనగర్, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్‌పల్లితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు మండలం ఉంది. ఈ ఏడు మండలాల పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 84గ్రామాలు మరో హైదరాబాద్ విస్తీర్ణానికి సమానం కావడం గమనార్హం. దీంతో జీఓ 111ను రద్దు చేయడంతో ఈ గ్రామాల్లో అంక్షలన్నీ ఎత్తవేయడంతో పారిశ్రామికాభివృద్ధికి మార్గం సుగమమైంది. దీంతో ఇప్పుడు అభివృద్ధి అంతా ఈ 84గ్రామాల వైపే జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    నీటి కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు

    వాస్తవానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌‌లోని నీరు కలుషితం కాకుండా ఉండేందుకు జీఓ111ను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ జీఓను రద్దు చేసిన తర్వాత నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో తాగు నీటి కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌‌‌తో పాటు గోదావరి, కృష్ణా, మంజీర నదుల నుంచి నీటి సరఫరా జరుగుతోంది. అయితే ప్రధానంగా గండిపేట, హిమాయత్ సాగర్‌లపై ప్రభావం చూపుతున్న నీటి కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు త్వరలో రింగ్ మెయిన్, ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. కొండపోచమ్మ సాగర్‌ను కాళేశ్వరం నీటితో నింపనున్నారు. మూసీని కూడా కాళేశ్వరం నీటితో నింపనున్నారు. ఈ రెండు జలాశయాలను నగరంలోని ఇతర నీటి వనరులతో అనుసంధానం చేయనున్నారు.

    కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే ప్రభుత్వం ప్రకటన

    వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం గతేడాదే జిఓ 111 ఆంక్షలను ఎత్తివేసింది. దీనికి బదులుగా జీఓ 69ని తీసుకొచ్చింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. 2022 సెప్టెంబరులో, రాష్ట్ర ప్రభుత్వం సరస్సులను కాలుష్యం నుంచి కాపాడటానికి బ్యూరోక్రాట్ల కమిటీ వేస్తామని, ఆ కమిటీ నివేదిక ఇచ్చేదాక జీఓ 111ఆంక్షలు అలాగే ఉంటాయని హైకోర్టుకు సర్కారు చెప్పింది. అనంతరం సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సరస్సుల పరిరక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి కమిటీ తన నివేదికను సమర్పించిందని, దాని ఆధారంగా ప్రభుత్వం జీఓ 111ను ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుందని సమాచారం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    హైదరాబాద్
    తెలంగాణ
    తాజా వార్తలు

    హైదరాబాద్

    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ వీసాలు

    తెలంగాణ

    తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు తాజా వార్తలు
    వన్ నేషన్ వన్ ప్రోడక్ట్: 72స్టేషన్లలో స్టాల్స్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే  భారతదేశం
    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్ ప్రభుత్వం
    ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు రాష్ట్రం

    తాజా వార్తలు

    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  మెక్సికో
    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  కాంగ్రెస్
    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115 కరోనా కొత్త కేసులు
    రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే ఆర్ బి ఐ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023