LOADING...
Priyanka Gandhi: ప్రజా సమస్యలు లేవనెత్తితే డ్రామా అంటారా? మోదీపై ప్రియాంకా గాంధీ ఫైర్!
ప్రజా సమస్యలు లేవనెత్తితే డ్రామా అంటారా? మోదీపై ప్రియాంకా గాంధీ ఫైర్!

Priyanka Gandhi: ప్రజా సమస్యలు లేవనెత్తితే డ్రామా అంటారా? మోదీపై ప్రియాంకా గాంధీ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
01:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

చట్టసభల్లో డ్రామాలొద్దని, విపక్షాలకు టిప్స్ ఇవ్వడానికి సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఎద్దేవాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్‌ వేదికగా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), దిల్లీ కాలుష్యం వంటి కీలక సమస్యలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఆమె పార్లమెంట్ శీతాకాల సీజన్ సందర్భంగా చెప్పారు. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ఎస్‌ఐఆర్‌, కాలుష్యం వంటి అంశాలు తీవ్రంగా ప్రభావితమైన ప్రజా సమస్యలు. ఇవన్నీ చర్చించాల్సిన విషయాలు. వాటిపై మాట్లాడటం ఎలాంటి డ్రామా కాదు. ప్రజాస్వామ్య చర్చలకు అవకాశం ఇవ్వకపోవడమే అసలు డ్రామా అని మోదీ వ్యాఖ్యలను ఎదురుదెబ్బ తీశారు.

Details

 మల్లికార్జున ఖర్గే పై ప్రధాని విమర్శలు

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రజాసమస్యలపై పార్లమెంట్‌లో చర్చించాల్సిన సందర్భంలోనే మోదీ మరోసారి నాటకీయ ప్రసంగాలు చేశారని ఖర్గే ఆక్షేపించారు. కాంగ్రెస్ అయితే రాజ్యాంగ విలువలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. శీతాకాల సమావేశాలు ప్రారంభంకాక ముందే సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. విపక్షాలకు సూచనలు చేస్తూ, కొంత వ్యంగ్యంగా మాట్లాడుతూ 'కొత్త ఎంపీలకు మన ప్రవర్తనే స్ఫూర్తి కావాలి. నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దు. విపక్షాలు తమ ఓటమి నిరాశను వదిలేయాలి. గత పదేళ్లుగా ప్రతిపక్షాలు ఆడుతున్న ఆటను దేశ ప్రజలు ఇక అంగీకరించరు. అవసరమైతే వారికి కొన్ని టిప్స్‌ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.

Advertisement