Loading...
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. ఐఎస్ఐ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించిన పంజాబ్ పోలీసులు
ఐఎస్ఐ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించిన పంజాబ్ పోలీసులు

Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. ఐఎస్ఐ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించిన పంజాబ్ పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతుతో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న ఓ భారీ నెట్‌వర్క్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అమృత్‌సర్ పోలీసులు రెండు వేర్వేరు ఉగ్ర ముఠాలకు చెందిన మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు మైనర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిందితుల వద్ద నుంచి నాలుగు పెట్రోల్ బాంబులు (బాటిల్ బాంబులు), మూడు పిస్టళ్లు, సజీవ కార్ట్రిడ్జ్లు, లైటర్లు, కెమెరాలు, ఇతర అనుమానాస్పద వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

భద్రతా సంస్థల అప్రమత్తతతో..

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. ఈ ఉగ్ర నెట్‌వర్క్ కార్యకలాపాల మూలాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వరకు విస్తరించినట్లు అధికారులు గుర్తించారు.

అరెస్టైన వారిలో ఒకరు తన సహచరులతో కలిసి జంతర్ మంతర్‌కు వెళ్లినట్లు, అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందించేందుకు ఐఎస్ఐ హ్యాండ్లర్లు ప్రయత్నించినప్పటికీ, భద్రతా సంస్థల అప్రమత్తతతో ఆ ప్రణాళిక విఫలమైందని పోలీసులు తెలిపారు.

అనంతరం నిందితులు తిరిగి పంజాబ్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

ఉగ్ర ముఠాకు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన సుఖ్‌మన్ సింగ్‌తో పాటు ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్

మొదటి ఉగ్ర ముఠాకు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన సుఖ్‌మన్ సింగ్‌తో పాటు ముగ్గురు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి నాలుగు బాటిల్ బాంబులు, రెండు పిస్టళ్లు, తొమ్మిది కార్ట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో సుఖ్‌మన్ సింగ్ ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

పంజాబ్‌లోని పోలీస్ భవనాలు, పోలీసుల కదలికలపై రెక్కీ నిర్వహించి సమాచారాన్ని సేకరించినట్లు కూడా వెల్లడైంది.

ADVERTISEMENT

వివరాలు 

ఒక పిస్టల్, నిఘా కెమెరాలు, దొంగిలించిన మోటార్‌సైకిల్‌ స్వాధీనం

రెండో ముఠా రైల్వే ట్రాక్‌ల సమీపంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, అక్కడి దృశ్యాలను పాకిస్థాన్‌లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లకు పంపుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

జోడా ఫాటక్ సమీపంలోని రైల్వే ట్రాక్ స్తంభానికి కెమెరా అమర్చిన ఘటనలో మోహకంపూరాకు చెందిన వంశీ కుమార్‌తో పాటు ఓ మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి ఒక పిస్టల్, నిఘా కెమెరాలు, దొంగిలించిన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సున్నితమైన సైనిక ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్నారనే అనుమానంతో జీఆర్పీ అధికారులు కూడా వీరిని విచారిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 

ఈ కుట్ర వెనుక ఉన్న మిగిలిన నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో అన్మోల్ సింగ్‌ను అదుపులోకి తీసుకోవడంతో పాటు, ఇప్పటికే ఆయుధాల చట్టం కేసులో జైలులో ఉన్న సుఖ్‌దేవ్ సింగ్, హర్మాన్ సింగ్‌లను ప్రొడక్షన్ వారెంట్‌పై విచారణ కోసం తీసుకొచ్చారు.

అరెస్టైన వారిలో 19 ఏళ్ల వంశీ కుమార్, 24 ఏళ్ల హర్మాన్ సింగ్ (టీ దుకాణంలో ఉద్యోగి), 30 ఏళ్ల సుఖ్‌దేవ్ సింగ్ (డ్రైవర్), 20 ఏళ్ల అన్మోల్ సింగ్, 19 ఏళ్ల సుఖ్‌మన్ సింగ్ (ట్రాక్టర్ డ్రైవర్)తో పాటు నలుగురు మైనర్లు ఉన్నారు.

వివరాలు 

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

ఆర్థికంగా వెనుకబడిన, చదువును మధ్యలోనే నిలిపివేసిన మైనర్లను చిన్న చిన్న ప్రలోభాలతో ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించినట్లు అమృత్‌సర్ పోలీస్ కమిషనర్ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లార్ తెలిపారు.

వారికి పెట్రోల్ బాంబులు తయారు చేయడం వంటి శిక్షణ ఇచ్చి దేశవ్యతిరేక చర్యల్లో భాగస్వాములను చేసినట్లు వెల్లడించారు.

విదేశీ ఫండింగ్, స్థానిక సహకారం, ఆయుధాల సరఫరా వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ADVERTISEMENT