హైదరాబాద్ లో ఐటీ సోదాలు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సహా చిట్ ఫండ్ కంపెనీలలో సోదాలు
హైదరాబాదులో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అంతేకాదు మాగంటి గోపీనాథ్ సోదరుల ఇళ్ళలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఐటీ సోదాల నిమిత్తం హైదరాబాద్లో 100 ఐటీ బృందాలు దిగినట్టు తెలుస్తోంది. చిట్ ఫండ్ కంపెనీలు ఇంకా ఫైనాన్స్ కంపెనీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, శంషాబాద్ ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అమీర్ పేట్ లోని ఎల్లారెడ్డిగూడలో పూజ కృష్ణ చిట్ ఫండ్ కంపెనీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో 20 బృందాలు పాల్గొన్నాయని సమాచారం.
చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపై ఐటి సోదాలు
అంతేకాదు పూజ కృష్ణ చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్ అయిన పూజ లక్ష్మి, ఎండీ కృష్ణ ప్రసాద్, సోంపల్లి నాగరాజు ఇండ్ల పైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. జీవన్ శక్తి చిట్ ఫండ్, ఈకామ్ చిట్ ఫండ్ కంపెనీలపై కూడా శోధాలు జరిగినట్లు సమాచారం. ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ లో అనుమానాలు ఉండడంతో ఈ సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాదు తమిళనాడులో ఐటీ సోదాలు జరిగాయని సమాచారం. డీఎంపే ఎంపీ జగద్రక్షన్ ఇంటితోపాటు ఆఫీసుల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగాయని తెలుస్తోంది.