J&K bus attack: జమ్ముకశ్మీర్ బస్సు దాడి.. దర్యాప్తు ప్రారంభించిన NIA
జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఆదివారం సాయంత్రం యాత్రికులు ప్రయాణిస్తున్నబస్సుపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 10 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు.ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు ఆ క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రాణాలతో బయటపడినవారు దాడికి సంబంధించిన భయానక వివరాలను వివరించారు. బస్సు ఒక లోయలో పడిపోతున్నప్పటికీ దుండగులు విచక్షణా రహితంగా కొన్ని నిమిషాల పాటు కాల్పులు కొనసాగించారని చెప్పారు. బస్సు డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో అదుపు తప్పి వాహనం లోయలో పడింది. విషయం తెలిసి భద్రతా బలగాలు ఉగ్రవాదుల జాడ కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
రియాసి ఉగ్రదాడిలో ప్రధాన పరిణామాలు
హోం మంత్రిత్వ శాఖ వర్గాల ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ దాడిపై దర్యాప్తు బాధ్యతలు చేపట్టినట్టు ఇండియాటుడే నివేదించింది. అటవీ ప్రాంతాన్ని శోధించడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు,ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్)బృందం కూడా ఆపరేషన్‌లో చేరింది. దాడి ఫలితంగా వాహనం ఒక లోయలో పడినప్పటికీ ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు కొనసాగించారని దాడి నుండి బయటపడిన వారు ఇండియా టుడేకి చెప్పారు. "ఒక తీవ్రవాది బస్సు లోయలో పడిన తర్వాత కూడా 20నిమిషాల పాటు కాల్పులు జరుపుతూనే ఉన్నాడు"అని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి చెప్పాడు. ఈదాడిలో పలువురు ఉగ్రవాదులు ఉన్నారని,వారి ముఖాలకు ముసుగులు వేసుకున్నారని చెప్పారు. వారు బస్సును అన్ని వైపుల నుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని యూపీకి చెందిన ప్రయాణీకుడు చెప్పారు.
దాడిలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు
బస్సు దిగువకు వెళ్ళినప్పుడు, వారు లోయలోకి దిగి, అందరూ చనిపోయారని నిర్ధారించుకోవడానికి వారు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. వారిని నమ్మించడానికి చనిపోయినట్లు నటించామని పలువురు తెలిపారు. రియాసి బస్సు దాడిలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని విశ్వసనీయ వర్గాలు ఇండియా టుడేకి తెలిపాయి. గత నెల రోజులుగా రాజౌరి ,పూంచ్‌లలో ఇతర దాడులకు పాల్పడిన అదే గ్రూపు ఉగ్రవాదులు కావచ్చని ప్రాధమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు దాడికి పాల్పడింది మేమేనని ఏ ఉగ్రవాద సంస్ధ ధృవీకరించలేదు.
బస్సుపై మెరుపుదాడి చేసిన ఉగ్రవాదులు
దట్టమైన చెట్లు ఉన్న చోట దాక్కున్న ఉగ్రవాదులు ఆదివారం బస్సుపై మెరుపుదాడి చేశారు. స్థానిక గ్రామస్థుల సహకారం మరపురానిది స్థానిక గ్రామస్థుల సహకారంతో పోలీసులు రాత్రి 8.10 గంటలకు ప్రయాణికులను బస్సునుంచి ఖాళీ చేయించారు. రియాసీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) తరలింపును పర్యవేక్షించారు . గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు, ఇండియన్ ఆర్మీ , CRPF జాయింట్ ఆపరేషన్ హెడ్‌క్వార్టర్స్ దాడి చేసిన వారి కోసం తీవ్రమైన గాలింపు కొనసాగిస్తోంది.