Page Loader
JammuandKashmir: జమ్ముకశ్మీర్‌లో బస్సును టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. గుంతలో పడిన బస్సు.. 8 మంది మృతి 
జమ్ముకశ్మీర్‌లో బస్సును టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. గుంతలో పడిన బస్సు.. 8 మంది మృతి

JammuandKashmir: జమ్ముకశ్మీర్‌లో బస్సును టార్గెట్ చేసిన ఉగ్రవాదులు.. గుంతలో పడిన బస్సు.. 8 మంది మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2024
08:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఈ బస్సులో 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం,ఈ బస్సుపై ఉగ్రవాదులు 40 నుంచి 50 రౌండ్లు కాల్పులు జరిపారు. అందులో ఒక బుల్లెట్ బస్సు డ్రైవర్‌కు కూడా తగిలింది. బస్సు డ్రైవర్‌పై కాల్పులు జరపడంతో బస్సు లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సును ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది భక్తులు మరణించారని, 15 నుంచి 20 మంది భక్తులు గాయపడినట్లు సమాచారం.

Details 

పౌని, రాన్సు మధ్య చండీ మోడ్‌లో ప్రమాదం

బస్సు శివఖోడి భోలే బాబాను దర్శించుకున్న తర్వాత తిరిగి కత్రా వైపు వెళ్తోంది. పౌని, రాన్సు మధ్య చండీ మోడ్‌లో ఉన్న దర్గా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బస్సును టార్గెట్ చేసిన ఉగ్రవాదులు