తదుపరి వార్తా కథనం
Bengaluru: ఒకే స్టేజ్‌పై జగన్, కేటీఆర్.. స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన ఈవెంట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 23, 2025
09:28 am
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో శనివారం జరిగిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నాయకులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి , బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీమంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిక్కజాల ప్రాంతంలోని సర్జ్ స్టేబుల్ ఈక్వెస్ట్రియన్ ఫెసిలిటీ కేంద్రంలో ఈ పోటీలు నిర్వహించగా, విజేతలకు ట్రోఫీలను స్వయంగా జగన్, కేటీఆర్ అందజేశారు. అంతర్జాతీయ స్థాయి గుర్రపు స్వారీ క్రీడాకారులు ఎడ్వర్డ్ స్కీమిజ్, బొండరివా జైన్, షాడీ సమీర్, వ్యాలంటైన్ మార్కట్ ఈ గ్రాండ్ ఫినాలేలో పాల్గొన్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.