జమ్ముకశ్మీర్: రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతం
రాజౌరీ జిల్లాలోని కంది అడవుల్లో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఉగ్రవాదికి గాయాలైనట్లు తెలుస్తోంది. రాజౌరిలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఆర్మీ జవాన్లు మరణించి, ఒక మేజర్ గాయపడిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది. ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని దృవీకరించారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో రాజౌరీ సెక్టార్‌లోని కంది అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఉమ్మడి కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉదయం 7గంటలకు ఉగ్రవాదులు తారపడినట్లు అధికారులు చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని రక్షణ ప్రతినిధి చెప్పారు.