Page Loader
Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 
బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు ఇద్దరు మృతి

Jammu and Kashmir: బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: ఇద్దరు మృతి 

వ్రాసిన వారు Stalin
Jul 09, 2023
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా భంఘ్రూ గండోహ్ గ్రామం సమీపంలో బస్సు పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆదివారం జరిగింది. కొండచరియలు విరిగిపడ్డ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బస్సులో చిక్కుకున్న నలుగురిని బయటకు తీసి సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గండోహ్‌కు తరలించారు. ఈ నలుగురిలో ఇద్దరు వ్యక్తులు మార్గమధ్యలోనే చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నట్లు డోడా జిల్లా కమిషనర్ విశేష్ మహాజన్ తెలిపారు. మృతులను దోడాలోని కహారా నివాసి అమిత్ సోహైల్, హలోర్ చంగా నివాసి ముదాసిర్ అలీగా పోలీసులు గుర్తించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విరిగిపడ్డ కొండచరియల్లో ఇరుక్కుపోయిన బస్సు