
Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్‌గా గోవింద్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్కంఠగా సాగిన గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది.
జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ గోవింద్‌రెడ్డి ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి మొత్తం 59 మంది సభ్యులు హాజరయ్యారు.
టీడీపీ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. గతంలో సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక, కోరం లోపం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఎన్నిక జరగాలంటే 56 మంది కార్పొరేటర్లు హాజరుకావాల్సి ఉండగా, కేవలం 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ పరిణామాలపై టీడీపీ, జనసేన హైకమాండ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Details
59 మంది సభ్యులు హాజరు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు నేతలు అసంతృప్త కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించారు.
ఉత్కంఠగా సాగిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది. జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ గోవింద్‌రెడ్డి ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి మొత్తం 59 మంది సభ్యులు హాజరయ్యారు.
టీడీపీ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. గతంలో సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక, కోరం లోపం కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
Details
అసంతృప్త కార్పొరేటర్లతో సమావేశం
ఎన్నిక జరగాలంటే 56 మంది కార్పొరేటర్లు హాజరుకావాల్సి ఉండగా, కేవలం 54 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ పరిణామాలపై టీడీపీ, జనసేన హైకమాండ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రంగంలోకి దిగగా, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు నేతలు అసంతృప్త కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహించారు