రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా భారత పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా సోమవారం భారత్, జపాన్ మధ్య రెండు కీలక ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు. జపనీస్ భాషలో ఎంఓకే (మెమోరాండం ఆఫ్ కోఆపరేషన్) పునరుద్ధరణ, భాషా అభ్యాసంపై దృష్టి సారించడానికి ఇది దోహదపడుతుంది. రెండవ ఒప్పందం ముంబయి-అహ్మదాబాద్ మధ్య హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్‌పై 300 బిలియన్ల జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) రుణంపై నోట్ల మార్పిడిపై ఇరు దేశాలు సంతకాలు చేసినట్లు క్వాత్రా చెప్పారు. 'ముంబయి-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ కోసం 2022లో తొలిసారిగా జైకాతో భారత ప్రభుత్వానికి 1,00,000 మిలియన్ జపనీస్ యెన్ రుణం కోసం ఒప్పందం జరిగింది.
జపాన్‌తో సంబంధాలు భారతదేశానికి ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమే: క్వాత్రా
జపాన్ షింకన్‌సెన్ సాంకేతికత(బుల్లెట్ రైలు) సాయంతో ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య హై-స్పీడ్ రైలును నిర్మించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. హై-ఫ్రీక్వెన్సీ మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చి, దేశంలో ప్రయాణాలను మరింత వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తోంది. తాజాగా నాలుగో విడత రుణం కింద భారతదేశం, జపాన్ మధ్య రుణ ఒప్పందం జరిగినట్లు క్వాత్రా చెప్పారు. జపాన్‌తో సంబంధాలు ఎల్లప్పుడూ భారతదేశానికి చాలా ప్రత్యేకం అని అన్నారు. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఆయన మొదటి ద్వైపాక్షిక పర్యటన జపాన్‌లోనే జరిగిందనే విషయాన్ని క్వాత్రా గుర్తు చేశారు. భారతదేశం-జపాన్ సంబంధాలు ఈ ప్రాంతంలో అత్యంత సహజమైన భాగస్వామ్యాల్లో ఒకటని క్వాత్రా అన్నారు.