
Chandrababu: జాబ్స్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి : చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవారు, ఇప్పుడు ఏఐ (కృత్రిమ మేధస్సు) గురించి మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. దావోస్ పర్యటనను ముగించుకుని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దావోస్ కు వెళ్లాలని నిర్ణయించిన వ్యక్తి తానేనని, 1997 నుంచి అక్కడ పర్యటిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో మనం జాబ్స్ అడగడం లేదని, ఇప్పుడు ఇచ్చే స్థితిలో ఉండాలని చెప్పారు.
ఐటీ రంగం హైటెక్ సిటీగా పరిణమించిందన్నారు.
Details
2028లో జీడీపీ వృద్ధిలో చైనాను అధిగమిస్తాం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆహ్వానించానని, ప్రస్తుతం తెలుగువాళ్లు ప్రపంచం మొత్తం వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.
మరోవైపు మనం తయారు చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, ఎంఎస్‌ఎంఈలు సృష్టించడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.
భారత్‌కు ప్రపంచంలో బంగారు భవిష్యత్తు ఉన్నట్లు తనకు నమ్మకం ఉందని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.
2028 నాటికి జీడీపీ వృద్ధిలో చైనాను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.