Page Loader
Raja Singh: తెలంగాణ ఎన్నికల వేళ.. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బీజేపీ 

Raja Singh: తెలంగాణ ఎన్నికల వేళ.. రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన బీజేపీ 

వ్రాసిన వారు Stalin
Oct 22, 2023
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. బీజేపీ తెలంగాణకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తివేయడంపై ఆసక్తికరంగా మారింది. ఓ వర్గంపై వివాదాస్ప వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్ఠానం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలో ఆ వ్యాఖ్యలపై రాజాసింగ్ వివరణ ఇవ్వగా.. ఆయన చెప్పిన సమాధానానికి తాము సంతృప్తి చెందినట్లు బీజేపీ సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ కార్యదర్శి ఓం పాఠక్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజాసింగ్‌పై ఎత్తివేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ బీజేపీ ట్వీట్