Kadem Project: కడెం ప్రాజెక్టు నుంచి 700 క్యూసెక్కుల నీరు విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
నిర్మల్ జిల్లా రైతుల పోరాటం ఫలించింది. జన్నారం,దస్తురాబాద్ మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించేందుకు అధికారులు కడెం ప్రాజెక్టు నుంచి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తమ పంట పొలాలకు నీరు అందడం లేదని ఇటీవల ఈ రెండు మండలాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల విజ్ఞప్తులు, నిరసనలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఎట్టకేలకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
వివరాలు
మంత్రులతో చర్చించిన ఎమ్మెల్యే
కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్పందించారు.
ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడినట్లు వెల్లడించారు.
మంత్రులతో సంప్రదింపులు జరిపిన అనంతరం జన్నారం, దస్తురాబాద్ మండలాల్లోని రైతుల పంట పొలాలకు నీరు అందించేందుకు 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చివరి ఆయకట్టు భూముల వరకు సాగునీరు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కడెం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలతో జన్నారం, దస్తురాబాద్ మండలాల్లోని రైతులకు ఊరట లభించనుంది.