
Karnataka: కర్ణాటక గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్ మంజూరు.. విజయోత్సవ ఊరేగింపుతో సంబరాలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో జరిగిన ఓ సామూహిక అత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు కావడం, అనంతరం వారు ఊరేగింపు నిర్వహించడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రేపుతోంది.
సుమారు 16 నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు ప్రధాన నిందితులు ఇటీవల హవేరి సెషన్స్ కోర్టు నుంచి బెయిల్ పొందారు.
2024 జనవరి 8న హవేరి జిల్లా అక్కి ఆలూర్ పరిధిలోని ఓ హోటల్ గదిలో మతాంతర ప్రేమ జంట గడుపుతున్న సమయంలో, కొందరు వ్యక్తులు హోటల్‌లోకి చొరబడి వారిపై దాడి చేశారు.
అనంతరం యువతిని బలవంతంగా సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు.
వివరాలు
ఎవరెవరు అరెస్టయ్యారు..?
ఈ కేసులో పోలీసులు అఫ్తాబ్ చందనకట్టి, మదార్ సాబ్ మండక్కి, సమీవుల్లా లాలనవర్, మహమ్మద్ సాదిక్ అగసిమని, షోయబ్ ముల్లా,తౌసిప్ చోటి, రియాజ్ సవికేరి అనే ఏడుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి,జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మొత్తం కేసులో 19మందిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. వీరిలో 12మందికి ఇప్పటికే దాదాపు పది నెలల క్రితమే బెయిల్ లభించగా,తాజాగా ప్రధాన నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ తర్వాత ఊరేగింపు - ప్రజల ఆగ్రహం
నిందితులు బెయిల్‌పై విడుదలైన వెంటనే హవేరి జిల్లాలోని అక్కి ఆలూర్ పట్టణంలో కార్లు,బైకులపై భారీ ఊరేగింపు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిందితులు నవ్వుతూ,విజయ సంకేతాలుగా చేతులు ఊపుతూ కనిపించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
వివరాలు
నిందితులను గుర్తించలేకపోయిన బాధితురాలు..
ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళల భద్రతపై ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఈ ఘటన మరోసారి బయటపెట్టిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
మొదట్లో ఈకేసును మోరల్ పోలీసింగ్ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేశారు.
బాధితురాలు ఓ కేఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్‌తో కలిసి హోటల్ గదిలో ఉండడమే వివాదానికి దారితీసింది.
అయితే, మూడు రోజుల తర్వాత అంటే జనవరి 11న బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు గ్యాంగ్ రేప్ సెక్షన్లను కేసులో చేర్చారు.
అయితే, విచారణ సమయంలో బాధితురాలు నిందితులను స్పష్టంగా గుర్తించలేకపోయినట్టు తెలుస్తోంది.
ఈ విషయం ప్రాసిక్యూషన్‌కు ప్రతికూలంగా మారి,కేసును బలహీనపరిచినట్టు న్యాయవర్గాలు చెబుతున్నాయి.
అంతకుముందు పలుమార్లు నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన కోర్టు,చివరికి కొన్ని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయోత్సవ ఊరేగింపు సంబరాలు
हावेरी, कर्नाटक में गैंग रेप आरोपियों ने कई कारों और मोटरसाइकिलों का “विजय जुलूस” निकाला, वीडियो शेयर करके दावा किया कि वो अपने “अच्छे संपर्कों” के चलते छूट गये
— ANUPAM MISHRA (@scribe9104) May 23, 2025
आरोपियों के नाम ~ आफ़ताब अहमद, मोहम्मद सादिक़, शोएब मुल्ला, तौसीफ़, समीउल्ला, मदार और वयास pic.twitter.com/r3ZIHLrQSt