Loading...
Telangana: దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకం కానున్నారు.. రేవంత్‌ హడావిడి కొన్నిరోజులే: కేటీఆర్
కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారు.. దేశ రాజకీయాల్లో కీలక మార్పులు: కేటీఆర్

Telangana: దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలకం కానున్నారు.. రేవంత్‌ హడావిడి కొన్నిరోజులే: కేటీఆర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజకీయాల్లో మరోసారి కేసీఆర్‌ కీలక పాత్ర పోషించే రోజులు రాబోతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట బీఆర్‌ఎస్‌ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి హడావిడి కొద్దిరోజులే ఉంటుందని, ఆ తర్వాత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌, భాజపాయేతర పార్టీలు కీలకంగా మారతాయని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ఏం చేసినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వల్ల దేశానికి ఏం జరిగిందో ప్రజలు చూస్తున్నారని అన్నారు.

వివరాలు 

రాష్ట్రంలో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైనందుకే యువత సీజేపీ పేరుతో పోరాటం చేస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా పనిచేయడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ చేతిలో మోసపోయిన వర్గాలన్నీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నాయని అన్నారు.

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా సరిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్‌నినో ప్రభావం ఉంటుందని నిపుణులు పది నెలల ముందే హెచ్చరించారని గుర్తుచేశారు.

అయినప్పటికీ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా బీఆర్‌ఎస్‌ నేతలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందని కేటీఆర్‌ అన్నారు.

ADVERTISEMENT