నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కోఆపరేటివ్ ఫెడరలిజం ఒక జోక్ అన్నారు. అందుకే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సుప్రీంకోర్టుకు కట్టుబడి ఉండకపోతే న్యాయం కోసం ఎక్కడికి వెళాలని ప్రజలు అడుగుతున్నారని కేజ్రీవాల్ తన లేఖలో వివరించారు. మే 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా పలు అంశాలపై చర్చించనున్నారు.