
కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ హోటల్ యజమానిని హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
హత్య అనంతరం నిందితులు మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో ఉంచి కేరళలోని అట్టప్పాడి ఘాట్ రోడ్డు వద్ద పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మృతుడు మలప్పురంలోని తిరూర్‌కు చెందిన హోటల్ యజమాని సిద్ధిక్‌గా గుర్తించారు.
అతను మే 18 నుంచి కనిపించకుండా పోయినట్లు తెలిపారు.
అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
హత్య
మే18 నుంచి 19 మధ్య హత్య
మే 18 నుంచి 19 మధ్య ఈ హత్య జరిగినట్లు మలప్పురం పోలీసు సూపరింటెండెంట్ సుజిత్ దాస్ తెలిపారు. రైల్వే పోలీసుల సహాయంతో హోటల్ సిబ్బంది, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరొకరిని కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. కోజికోడ్ మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారి తెలిపారు. మిస్సింగ్ ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
అయితే నిందితులు ఈ హత్యను ఎందుకు చేశారనే విషయం స్పష్టంగా తెలియడం లేదని ఎస్పీ సుజిత్ దాస్ వెల్లడించారు.