Konaseema: ఆత్రేయపురంలో కేరళ తరహా డ్రాగన్ బోటింగ్ పోటీలు
ఈ వార్తాకథనం ఏంటి
పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వ పెద్దలు కోనసీమలో సంక్రాంతి సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 'సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ' పేరుతో కేరళ తరహాలో పడవ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీలకు 180 మంది క్రీడాకారులతో కూడిన 11 జట్లు పలు జిల్లాల నుంచి పాల్గొన్నాయి.
బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఉచ్చిలి నుండి ఆత్రేయపురం వరకు 1000 మీటర్ల పరిధిలో యువకుల కోసం డ్రాగన్ బోట్ రేస్, యువతుల కోసం కనోయింగ్ బోటింగ్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి.
ప్రతి పడవలో 12 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
Details
పోటీలను ప్రారంభించిన రుడా ఛైర్మన్
అట్టహాసంగా జరుగుతున్న ఈ పోటీలను రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కొత్తపేట, రాజోలు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు సత్యానందరావు, దేవవరప్రసాద్, పత్సమట్ల ధర్మరాజు ప్రారంభించారు.
డ్రాగన్ పడవ పోటీల్లో జంగారెడ్డిగూడెం జెయింట్, పల్నాడు థండర్స్, ఎన్టీఆర్ ఈగల్స్, కోటిపల్లి చీతాస్, పల్నాడు పాంథర్స్, కృష్ణా లయన్స్ జట్లు సెమీ ఫైనల్స్‌కు ఎంపికయ్యాయి.
సోమవారం ఈత, డ్రాగన్ పడవ పోటీలలో 100 మీటర్ల సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జరుగనున్నాయి.