Loading...
BRICS Declaration: బ్రిక్స్‌ దేశాల మధ్య కీలక ఒప్పందం.. ఉమ్మడి ప్రకటనకు గ్రీన్‌సిగ్నల్‌!
బ్రిక్స్‌ దేశాల మధ్య కీలక ఒప్పందం.. ఉమ్మడి ప్రకటనకు గ్రీన్‌సిగ్నల్‌!

BRICS Declaration: బ్రిక్స్‌ దేశాల మధ్య కీలక ఒప్పందం.. ఉమ్మడి ప్రకటనకు గ్రీన్‌సిగ్నల్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిక్స్‌ డిక్లరేషన్‌ (BRICS Declaration) కోసం సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఏ దేశం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా.. ఏ దేశమైనా చేపట్టే ఏకపక్ష యుద్ధాన్ని ఖండిస్తూ ఉమ్మడి ప్రకటనను వెలువరించేందుకు బ్రిక్స్‌ దేశాల కూటమి అంగీకరించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కాగా, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా (Gulf conflict) ఇరాన్‌ (Iran), యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు బ్రిక్స్‌ సభ్య దేశాల ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల అనంతరం బ్రిక్స్‌ దేశాల అధినేతలు ఏకాభిప్రాయ ప్రకటనను ఆమోదించే అవకాశం ఉంది.

వివరాలు

కీలక అంశాలపై చర్చించే అవకాశం

బ్రిక్స్‌ అధినేతలు దేశాల మధ్య ఆర్థిక సహకారం, ఇంధనం, ఆహార భద్రత, సాంకేతికత, ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

అమెరికా డాలర్‌ (US dollar)పై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, వాణిజ్యంతో సహా ఇతర చెల్లింపుల్లో తమ సొంత కరెన్సీల వినియోగాన్ని పెంచడాన్ని ప్రోత్సహించడంపైనా సభ్య దేశాలు దృష్టిపెట్టనున్నాయి.

ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు బ్రిక్స్‌ కీలకమైన సాధనమని చైనా, రష్యా భావిస్తున్నాయి.

ADVERTISEMENT