
MLAs Defection Case: పార్టీ ఫిరాయింపులపై నేడు కీలక విచారణ.. ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ!
ఈ వార్తాకథనం ఏంటి
నేడు తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌ల ధర్మాసనం విచారించనుంది. గత విచారణలో బీఆర్ఎస్ తరఫున వాదనలు పూర్తయ్యాయి.
ఈరోజు స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ, ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ వాదనలు వినిపించనున్నారు.
బీఆర్ఎస్ వాదన ప్రకారం, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏడాది గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది.
Details
స్పీకర్ వైఖరిపై బీఆర్ఎస్ అసంతృప్తి
ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, ఇప్పటికీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
అనర్హత చట్టాన్ని స్పీకర్ ఎందుకు అమలు చేయడం లేదని కోర్టును ప్రశ్నించాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ తరఫున కౌంటర్ దాఖలు చేశారు.
ఫిరాయింపుల కేసులో చట్ట ప్రక్రియను అనుసరిస్తున్నామని, కోర్టులు స్పీకర్‌ను ఆదేశించకూడదని పేర్కొన్నారు.
అనర్హత చట్టంలోని విధి విధానాలను పాటిస్తున్నామని కూడా స్పష్టం చేశారు.