Loading...
Kodandaram: దిల్లీలో విద్యార్థుల మహాధర్నాకు కోదండరామ్ సంఘీభావం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
దిల్లీలో విద్యార్థుల మహాధర్నాకు కోదండరామ్ సంఘీభావం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్

Kodandaram: దిల్లీలో విద్యార్థుల మహాధర్నాకు కోదండరామ్ సంఘీభావం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై జరుగుతున్న విద్యార్థుల మహాధర్నాకు తెలంగాణ జనసమితి పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ వెల్లడించారు. దిల్లీలో సీజేపీ నేతలను కలిసి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే విద్యార్థులు పూర్తిగా న్యాయపరమైన డిమాండ్లనే లేవనెత్తుతున్నారని కోదండరామ్ అన్నారు. పరీక్షలను పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు కోరుతున్నారని పేర్కొన్నారు.

వివరాలు

150కు పైగా పరీక్షల్లో గందరగోళం

దేశంలో పేపర్ లీకుల కారణంగా పరీక్షల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆయన విమర్శించారు. సీబీఎస్‌ఈ (CBSE), నీట్ (NEET) సహా దాదాపు 150 రకాల పరీక్షలు గందరగోళానికి గురయ్యాయని చెప్పారు.

దీంతో తమ భవిష్యత్తు ఏమవుతుందో తెలియక విద్యార్థులు తీవ్ర అయోమయంలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పరీక్షల నిర్వహణలో వైఫల్యమే నిరసనలకు కారణం

పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వ వైఫల్యమే విద్యార్థుల ఆందోళనలకు ప్రధాన కారణమని కోదండరామ్ అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం విద్యార్థులు శాంతియుతంగా, చట్టబద్ధంగానే తమ నిరసనను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.

వివరాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌కు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పేపర్ లీకేజీకి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

పేపర్ లీకేజీలకు కారణమైన అధికారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడే ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT