Page Loader
ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్ 
ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్

ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్ 

వ్రాసిన వారు Stalin
Jun 07, 2023
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా సోషల్ మీడియా చేసిన పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది. నగరంలోని పలు సంఘాల నేతలు బుధవారం కొల్హాపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు ఉదయం 10 గంటలకు శివాజీ మహారాజ్ చౌక్ వద్ద గుమిగూడి, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసిన ఇద్దరు నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. మరాఠా భూమిపై మొఘల్ నాయకులను కీర్తించడాన్ని సహించబోమని నిరసనకారులు తేల్చి చెప్పారు. కొంతమంది నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు ఆరోపించారు.

మహారాష్ట్ర

విచారణ జరుగుతోంది, చర్యలు తీసుకుంటాం: సీఎం షిండే

నగరంలోని ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ కూడా ప్రయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అంతకుముందు టౌన్ హాల్ ప్రాంతంలో రాళ్ల దాడి జరిగింది. భారతదేశంలోని హిందువులు సురక్షితంగా లేరని, ''లవ్ జిహాద్'', ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ' గురించి ప్రస్తావిస్తూ, భారతదేశంలో హిందువుల భద్రత గురించి కొంతమంది నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తాను కూడా శాంతి భద్రతలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.