NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Koltaka Doctor Murder: కోల్‌కతా రేప్-హత్య బాధితురాలి విగ్రహం.. నెట్టింట విమర్శలు 
    తదుపరి వార్తా కథనం
    Koltaka Doctor Murder: కోల్‌కతా రేప్-హత్య బాధితురాలి విగ్రహం.. నెట్టింట విమర్శలు 
    కోల్‌కతా రేప్-హత్య బాధితురాలి విగ్రహం.. నెట్టింట విమర్శలు

    Koltaka Doctor Murder: కోల్‌కతా రేప్-హత్య బాధితురాలి విగ్రహం.. నెట్టింట విమర్శలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కోల్‌కతా లోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

    ఈ క్రమంలో, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో తాజాగా మృతురాలికి నివాళిగా ఒక అమ్మాయి విగ్రహం ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.

    విగ్రహం బాధితురాలిని అగౌరపర్చేలా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి ఆసిత్ సైన్. "క్రై ఆఫ్ ది అవర్" అనే పేరు పెట్టబడిన ఈ విగ్రహం, హత్యాచార సమయంలో బాధితురాలు అనుభవించిన క్షోభను ప్రతిబింబించేలా రూపొందించబడింది.

    దీనిని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోని ప్రిన్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేశారు.

    వివరాలు 

    విగ్రహానికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ 

    "ఇది బాధితురాలి విగ్రహం కాదు; ఇది ఆమె అనుభవించిన వేదన, హింసకు ప్రతీక" అని ఆసిత్ తెలిపారు.

    ఈ విగ్రహానికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో కొందరు షేర్ చేయడంతో, ఇవి త్వరగా వైరల్ అయ్యాయి.

    విగ్రహం ఏర్పాటుకు వెనక ఉద్దేశం మంచిదైనా, నెట్టింట దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

    "ఇది బాధితురాలిని అవమానించడం. ఓ అత్యాచార బాధితురాలిపై ఆధారపడి ఇలాంటి విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారు? ఇది మంచి సలహా అని ఎవరు చెప్పారు? దీన్ని ఎవరు ఆమోదించారు?" అంటూ పలువురు నెటిజన్లు ఆగ్రహంగా స్పందిస్తున్నారు.

    వివరాలు 

     సివిల్ వాలంటీర్ సంజయ్‌ రాయ్‌ అరెస్టు 

    ఈ ఏడాది ఆగస్టు 9న కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలిని అర్ధనగ్న స్థితిలో విగత జీవిగా కనుగొన్నారు.

    ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

    ఈ ఘటనకు పాల్పడిన సివిల్ వాలంటీర్ సంజయ్‌ రాయ్‌ని అరెస్టు చేశారు.

    ప్రస్తుతం దీనిపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు, ఈ ఘటనను నిరసిస్తూ కోల్‌కతాలో జూనియర్ వైద్యుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కోల్‌కతా

    West Bengal: టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను వెంటనే అరెస్టు చేయండి: కోలకత్తా హైకోర్టు హైకోర్టు
    Kolkata: సహజీవన భాగస్వామిని కత్తితో పొడిచి చంపిన మహిళ  భారతదేశం
    రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక బీజేపీ
    Building Collapsed: కోల్ కత్తా లో కుప్పకూలిన భవనం, 10మందిని రక్షించిన సహాయక సిబ్బంది  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025