Page Loader
KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ 
KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ 

వ్రాసిన వారు Stalin
Feb 25, 2024
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓఆర్‌ఆర్‌ (ఔటర్‌ రింగ్‌ రోడ్డు)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాస్య కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. లాస్య మరణవార్త విని తాను దిగ్ర్భాంతికి గురయ్యానని కేటీఆర్ వివరించారు. లాస్య మృతి చెందిన సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని, ఈ క్రమంలో వెంటనే తిరిగి రాలేకపోయానని చెప్పారు. లాస్య నందిత మరణం బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లాస్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న కేటీఆర్