చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం: కేటీఆర్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన విషయం పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినదని చెప్పారు. చంద్రబాబు అరెస్టు పంచాయితీని ఆంధ్రప్రదేశ్‌లోనే తేల్చుకోవాలి, ఆ వ్యవహారానికి తెలంగాణను వేదిక కానివ్వబోమని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, టీడీపీ మధ్య జరుగుతున్న యుద్ధంగా కేటీఆర్ అభివర్ణించారు. చంద్రబాబు అరెస్టుపై తమ పార్టీ నేతలు స్పందిస్తే, అది వారి వ్యక్తిగత విషయం అన్నారు. ఏపీలోని సమస్యపై హైదరాబాద్‌లో ఆందోళలు చేయడం సరికాదన్నారు.