NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా
    తదుపరి వార్తా కథనం
    యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా
    యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా

    యూకే కోర్టులో రాహుల్ గాంధీపై లలిత్ మోదీ దావా

    వ్రాసిన వారు Stalin
    Mar 30, 2023
    11:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై కేసు పెడతానని చెప్పారు.

    రాహుల్ గాంధీపై యూకే కోర్టులో దావా వేయనున్నట్లు లలిత్ మోదీ తెలిపారు.

    'మోదీ ఇంటిపేరు'పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీని పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కొద్ది రోజుల తర్వాత లలిత్ మోదీ స్పందించారు.

    2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 'దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?' అని అన్నారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యల్లో లలిత్ మోదీ పేరును కూడా ప్రస్తావించారు.

    లలిత్ మోదీ

    ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడినట్లు రుజువు కాలేదు: లలిత్ మోదీ

    ఈ వ్యవహారంలో ఆలస్యంగా స్పందించిన లలిత్ మోదీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఏ కారణాలతో తనను "పరారీ" అని ముద్రవేస్తున్నారని ప్రశ్నించారు.

    రాహుల్ గాంధీని తాను యూకే కోర్టుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు లలిత్ మోదీ ట్వీట్ చేశారు. అతను కొన్ని గట్టి సాక్ష్యాధారాలతో ముందుకు వస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

    పలువురు కాంగ్రెస్ నేతలను ట్యాగ్ చేస్తూ, పాలకులు కఠినమైన బాధ్యతాయుతమైన చట్టాలను ఆమోదించిన వెంటనే తాను తిరిగి వస్తానని చెపారు.

    గత 15 ఏళ్లలో తాను ఒక్క పైసా కూడా అవినీతికి పాల్పడినట్లు రుజువు కాలేదన్నారు. కానీ స్పష్టంగా రుజువైన విషయం ఏమిటంటే తాను నేను ఈ ప్రపంచంలోనే 100 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిన గొప్ప క్రీడా ఈవెంట్‌ను సృష్టించానని పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ పై విరుచుకుపడ్డ లలిత్ మోడీ

    i see just about every Tom dick and gandhi associates again and again saying i ama fugitive of justice. why ?How?and when was i to date ever convicted of same. unlike #Papu aka @RahulGandhi now an ordinary citizen saying it and it seems one and all oposition leaders have nothing…

    — Lalit Kumar Modi (@LalitKModi) March 30, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ
    బ్రిటన్
    తాజా వార్తలు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    రాహుల్ గాంధీ

    'సైనికులు రుజువు చూపాల్సిన అవసరం లేదు' సర్జికల్ స్ట్రైక్స్‌పై రాహుల్ కామెంట్స్ జమ్ముకశ్మీర్
    సర్జికల్ స్ట్రైక్స్: 'జవాన్లపై నమ్మకం ఉంది, కానీ బీజేపీని విశ్వసించలేం' కాంగ్రెస్
    'భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించండి', అమిత్ షాకు ఖర్గే లేఖ జమ్ముకశ్మీర్
    నేడు శ్రీనగర్‌లో 'భారత్ జోడో యాత్ర' ముగింపు వేడుక, 21 పార్టీలకు కాంగ్రెస్ ఆహ్వానం జమ్ముకశ్మీర్

    బ్రిటన్

    ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ: ట్వీట్లు, యూట్యూబ్ వీడియోలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశం నరేంద్ర మోదీ
    సీటుబెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌కు జరిమానా అంతర్జాతీయం
    నన్ను చంపుతానని పుతిన్ బెదిరించారు: బోరిస్ జాన్సన్ రష్యా
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా

    తాజా వార్తలు

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    'రాహుల్ గాంధీపై అనర్హత వేటు అప్రజాస్వామికం'; లండన్‌లో కాంగ్రెస్ నిరసన బ్రిటన్
    బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం! దలైలామా
    కరోనాపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం; ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్‌ కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025