Page Loader
LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు 
LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు

LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు 

వ్రాసిన వారు Stalin
Feb 14, 2024
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ శాఖ సీఐ మృతి చెందగా, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ, ఎస్ఐ ఇద్దరూ ఎల్‌బీ నగర్‌లోని ఓ కార్యక్రమానికి హాజరై తరిగి మలక్‌పేటలోని క్వార్టర్స్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్‌లో వస్తున్న కారు యూ టర్న్‌ తీసుకుని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ సాదిక్ అలీ మృతి చెందగా.. నారాయణ గూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ కాజ వల్లి మొహినుద్దీన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బైక్‌ను ఢీకొట్టిన కారును సీజ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎస్‌ఐకి గాయాలు