Loading...
SIR: ఆద్వాణీ, జైశంకర్‌ సహా ప్రముఖులకు సర్‌ నోటీసులు..  
ఆద్వాణీ, జైశంకర్‌ సహా ప్రముఖులకు సర్‌ నోటీసులు..

SIR: ఆద్వాణీ, జైశంకర్‌ సహా ప్రముఖులకు సర్‌ నోటీసులు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 21, 2026
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకీ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) నోటీసు తప్పలేదు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ఆయన పేరు మ్యాపింగ్‌ కాకపోవడంతో ఎన్నికల అధికారులు నోటీసు జారీ చేశారు. 98 ఏళ్ల ఆడ్వాణీతోపాటు ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతిక పేర్లు కూడా అప్పటి జాబితాతో సరిపోలకపోవడంతో ముగ్గురికీ నోటీసులు అందాయి. అయితే ఆయన కుమారుడు జయంత్‌కు మాత్రం సర్‌ నోటీసు అవసరం రాలేదు.

వివరాలు 

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ కి సర్‌ నోటీసు

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, ఆయన భార్య క్యోకో జైశంకర్‌లకు ఇచ్చిన నోటీసుల్లోనూ 2002 ఓటర్ల జాబితాతో పేర్ల మ్యాపింగ్‌ అంశాన్నే కారణంగా పేర్కొన్నారు.

వీరంతా దిల్లీలోని న్యూఢిల్లీ శాసనసభ నియోజకవర్గ ఓటర్లు.

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.సంధూకు కూడా సర్‌ నోటీసు అందడం గమనార్హం.

ఎన్యూమరేషన్‌ ఫాంలో ఆయన పేరు 'డాక్టర్‌ ఎస్‌.ఎస్‌.సంధూ'గా ఉండగా.. ఓటర్ల జాబితాలో 'సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ'గా నమోదై ఉండటమే ఇందుకు కారణం.

ఆయన సమర్పించిన పత్రాలను అధికారులు పరిశీలించిన అనంతరం తుది ఓటర్ల జాబితాలో పేరు కొనసాగిస్తామని తెలిపారు.

వివరాలు 

ప్రముఖులకూ సర్‌ నోటీసులు

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ తదితర ప్రముఖులకూ సర్‌ నోటీసులు అందాయి.

దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా, ఆయన భార్య సీమా, కుమారుడు మీర్‌లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

అయితే సిసోదియాకు ఇచ్చిన నోటీసులో నిర్దిష్ట కారణాన్ని అధికారులు పేర్కొనలేదు.

సీమా విషయంలో ఆమె సొంత పేరు సరిపోలడం లేదని, మీర్‌ విషయంలో తండ్రి పేరులో వ్యత్యాసం ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు.

మాజీ సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీతలకు కూడా 'అన్‌మ్యాప్‌డ్‌ విత్‌ లాస్ట్‌ ఎస్‌ఐఆర్‌' కింద నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

సీబీఐ డైరెక్టర్‌కూ తప్పని నోటీసు

సర్‌ నోటీసులు అందుకున్న లేదా త్వరలో అందుకోబోతున్న ప్రముఖుల్లో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌, జేఎన్‌యూ మాజీ వీసీ ఆచార్య ఎం. జగదీశ్‌ కుమార్‌, దిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, నీతిఆయోగ్‌ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగడియా తదితరులు ఉన్నారు.

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి మాజీ ఛైర్మన్‌ దివంగత వివేక్‌ దేబ్‌రాయ్‌ పేరు కూడా సర్‌ నోటీసులు జారీ చేయాల్సినవారి జాబితాలో ఉండటం మరో విశేషం.

అయితే ఆయన మరణించిన విషయం తమకు తెలుసని, తుది ఓటర్ల జాబితా నుంచి ఆయన పేరును తొలగిస్తామని ఓ ఎన్నికల అధికారి తెలిపారు.

ADVERTISEMENT