Loading...
Loksabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజు ట్విస్ట్.. ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా
ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా

Loksabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజు ట్విస్ట్.. ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 13, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అధికార పక్షం,ప్రతిపక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, చివరిరోజు ఉభయ సభల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఆసక్తికి చివరికి ముగింపు పడింది. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాకముందే నిరవధిక వాయిదా వేయడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం నాడు లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే విపక్ష నేత రాహుల్ గాంధీతో సహా సభ్యులందరూ హాజరయ్యారు. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, ప్రభుత్వాన్ని నిలదీసి తీరతామని ప్రతిపక్షాలు సవాలు విసిరాయి. ఈ పరిస్థితుల్లో సభలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

వివరాలు 

యథావిధిగా రాజ్యసభ

అయితే, 'వందేమాతరం' ప్రార్థన అనంతరం లోక్‌సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

అదే సమయంలో, రాజ్యసభ మాత్రం తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తోంది.

ఆగస్టు 20వ తేదీన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

మొత్తం 18రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాలు చాలావరకు వాయిదాలకే పర్యవసానించాయి.

ప్రతిపక్షాల నిరసనలు,ఆందోళనల కారణంగా ఉభయ సభలు తీవ్ర గందరగోళానికి గురయ్యాయి.

మొత్తం సమావేశాల వ్యవధిలో, పరీక్షా సవరణ బిల్లుపై మాత్రమే చర్చ జరగడం విశేషం - మిగిలిన అంశాలపై సరైన చర్చే జరగలేదు.

ప్రతిపక్షాలు నిరసనలు చెలరేగిస్తున్న సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం మూజువాణి ఓటు (వాయిస్ వోట్) ద్వారా మొత్తం ఏడు బిల్లులకు ఆమోదం తెలిపి చర్చను తప్పించుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post

ADVERTISEMENT