Page Loader
Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ
Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ

Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ

వ్రాసిన వారు Stalin
Feb 25, 2024
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో టెక్స్ట్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి. మార్చి 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, ఏప్రిల్‌ 19న లోక్‌సభ పోలింగ్ జరుగుతుందని, మే 22న ఫలితాలు వెలువడుతాయని ఎన్నికల సంఘం ఒక ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. టెక్స్ట్‌, వాట్సాప్‌ మెసేజ్‌లు నకిలీవని, ఎన్నికల షెడ్యూల్‌ను ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని, ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని ఈసీఐ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎన్నికల సంఘం క్లారిటీ