Anti Paper leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్.. ఇక లీక్‌లకు కఠిన శిక్షలు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 29, 2026
03:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లులో మార్పులు చేయాలంటూ విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది. పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌లను అరికట్టేందుకు ఈ బిల్లు కీలకమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పేపర్ లీక్‌లకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా బిల్లులో స్పష్టమైన నిబంధనలు పొందుపరిచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకతను, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది.