
Lokesh-Amarnath: కోడిగుడ్డు.. గాడిదగుడ్డు అంటూ తిట్టేసుకున్న లోకేశ్, అమర్నాథ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో తిట్ల పురాణం సర్వసాధారణమే. తాజాగా ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తిట్టుకున్నారు.
నువ్వు కోడిగుడ్డు అంటే.. కాదు, కాదు.. నువ్వే గాడిదగుడ్డు అంటూ ఇద్దరూ తిట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఈ-కార్ రేస్ వేళ.. అమర్నాథ్ కోడి గుడ్డు స్టోరీ చెప్పిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి అమర్నాథ్‌ను టీడీపీ కొడిగుడ్డు మంత్రి అంటూ ట్రోల్ చేస్తోంది.
ఇటీవల లోకేశ్ కూడా అనకాపల్లి పర్యటనలో అమర్నాథ్‌ను కోడిగుడ్డు మంత్రి అన్నారు.
తాజాగా లోకేశ్ వ్యాఖ్యలపై అమర్నాథ్ స్పందించారు. తనను కోడిగుడ్డుతో పోల్చిన లోకేశ్ గాడిద గుడ్డు అంటూ ట్వీట్ చేసారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమర్నాథ్ ట్వీట్
నన్ను కోడి గుడ్డుతో పోల్చిన గాడిద గుడ్డు @Naralokesh గారికి..
— Gudivada Amarnath (@gudivadaamar) December 17, 2023
మీ పార్టీలో గెలిచిన ఏ ఎమ్మెల్యే తోనైనా చర్చకు సిద్ధం