Loading...
BJP MLA Car: ఫైరింజిన్ నీటితో బీజేపీ ఎమ్మెల్యే కారు వాషింగ్.. వీడియో వైరల్
ఫైరింజిన్ నీటితో బీజేపీ ఎమ్మెల్యే కారు వాషింగ్.. వీడియో వైరల్

BJP MLA Car: ఫైరింజిన్ నీటితో బీజేపీ ఎమ్మెల్యే కారు వాషింగ్.. వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 26, 2026
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారును ఫైరింజిన్ నీటితో శుభ్రం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన ఫైరింజిన్ నీటిని వ్యక్తిగత కారును కడగడానికి వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నివాసం ఆవరణలో టొయోటా ఇన్నోవా కారును మున్సిపల్ సిబ్బంది ఫైరింజిన్ నీటితో శుభ్రం చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఫైరింజిన్‌లోని నీటి పంపును ఉపయోగించి ఉద్యోగులు కారును కడుగుతున్న దృశ్యాలు మంగళవారం వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే రామ్ నివాస్ షా స్పందిస్తూ.. తనకు తెలియకుండానే కారును శుభ్రం చేసినట్లు తెలిపారు.

వివరాలు 

తీవ్రంగా స్పందించిన ప్రతిపక్షాలు

అయితే ఈ వీడియోపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి.

వ్యక్తిగత వాహనం కోసం ప్రభుత్వ వనరులను వినియోగించుకున్నారంటూ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశాయి.

ఫైరింజిన్ వంటి అత్యవసర సేవల వనరులను ప్రైవేటు అవసరాలకు ఉపయోగించడం సమంజసం కాదని ప్రశ్నించాయి.

ఈ ఘటనపై తనకు ఎలాంటి సమాచారం లేదని సింగ్రౌలీ మున్సిపల్ కమిషనర్ సవితా ప్రధాన్ తెలిపారు.

వివరాలు 

అగ్నిమాపక సిబ్బందినే ప్రైవేటు కారు వాషింగ్ సెంటర్‌గా మార్చుకున్నారని ఆరోపణలు 

ఫైరింజిన్ సిబ్బంది ఈ విధంగా కారును శుభ్రం చేసిన విషయం తన దృష్టికి రాలేదని పేర్కొన్నారు.

మరోవైపు మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింఘార్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అగ్నిప్రమాదం జరిగినప్పుడు అవసరమైన ప్రాంతాలకు ఫైరింజిన్లు సకాలంలో చేరుకోలేని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి వాహనాన్ని వ్యక్తిగత కారు వాషింగ్ కోసం ఉపయోగించారని విమర్శించారు.

సింగ్రౌలీలో అగ్నిమాపక సిబ్బందినే ప్రైవేటు కారు వాషింగ్ సెంటర్‌గా మార్చుకున్నారని ఆరోపించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫైరింజిన్ నీటితో ఇన్నోవా కారు వాషింగ్.. వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

ADVERTISEMENT