Maratha reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం
మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉద్యోగాలు, విద్యలో సామాజికంగా.. విద్యాపరంగా వెనుకబడిన తరగతుల క్రింద 10% మరాఠా రిజర్వేషన్ల చట్టం ఆమోదించడంతో మహారాష్ట్రలో మొత్తం రిజర్వేషన్లు 62 శాతానికి చేరుకుంది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్, రిటైర్డ్ జడ్జి సునీల్ షుక్రే.. మరాఠా సమాజ వెనుకబాటుతనాన్ని పరిశోధించడానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికను ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు సమర్పించారు. సునీల్ షుక్రే నివేదిక ఆధారంగా 10% మరాఠా రిజర్వేషన్ కల్పించాలని షిండే ప్రభుత్వం నిర్ణయించింది.