
కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని ఖోపోలి ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బస్సు కాలువలోకి దూసుకెళ్లడంతో 12 మంది మృతి చెందగా, 25 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
బస్సులో 40 నుంచి 45 మంది వరకు ఉన్నారని రాయ్‌గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) తెలిపారు. బస్సును కాలువ నుంచి బయటకు తీయడానికి క్రేన్‌ను పిలిపించినట్లు పేర్కొన్నారు.
మహారాష్ట్ర
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
బస్సు తీవ్రంగా దెబ్బతినడంతో మృతు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
బస్సు కిటికీలు, పైకప్పు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రాణాలతో ఉన్న వారిని రెస్క్యూ సిబ్బంది తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటకు తీస్తున్నారు.
బస్సులోని ప్రయాణికులు గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఒక సంస్థకు చెందినవారు, వారు ఒక కార్యక్రమం కోసం పూణెకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రమాద వివరాలను వెల్లడించిన రాయ్‌గడ్ ఎస్పీ
#UPDATE | Maharashtra: 12 people died & more than 25 injured after a bus fell into a ditch in Raigad's Khopoli area. Rescue operations underway: Raigad SP
— ANI (@ANI) April 15, 2023