
పెళ్లి చేసుకోమ్మన్నందుకు యువతిని చంపి మ్యాన్‌హోల్‌లోకి తోసేసిన ప్రియుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు పూజారి. అంతటితో ఆగకుండా ఆమెను కిరాతకంగా చంపాడు.
ఆ తర్వాత మృతదేహం దొరక్కుండా మృతురాలిని మ్యాన్ హోల్‌లోకి తోసేసి ఏమి ఎరగనట్టు బయటకొచ్చాడు.
ఈ ఘోర ఘటన హైదరాబాద్ మహానగర పరిధిలోని సరూర్‌నగర్‌లో చోటు చేసుకోవడం రాజధానిలో కలకలం రేపుతోంది.
సరూర్‌నగర్‌లో ఇద్దరిదీ ఒకే ఏరియా కావడంతో రోజూ ఒకరినిఒకరు చూసుకునేవారు. ఈ క్రమంలో వారికి మాటలు కలిశాయి. తర్వాత ప్రేమలోకి దిగారు.
అయితే సాయికృష్ణకు అప్పటికే వివాహమై ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలియని అప్సర, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఎప్పటికైనా తనకు ముప్పు కావొచ్చనే దుర్భుద్ధితో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని సాయికృష్ణ పథకం రచించాడు.
DETAILS
పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన పూజారి
పెళ్లి విషయం మట్లాడదామని ఈ నెల 3న అప్సరను సరూర్‌నగర్ నుంచి కారులో ఎక్కించుకుని శంషాబాద్‌కు తీసుకెళ్లాడు.
కారు నార్కుడ వద్దకు వచ్చాక బాధితురాలికి ఓ గోలి మందు ఇచ్చి మత్తులోకి దించాడు. అనంతరం ఆమె తలపై బండరాయితో అతిదారుణంగా కొట్టి చంపాడు.
ఈ క్రమంలో మృతదేహాన్ని ఓ కవర్‌లో పెట్టి సరూర్ నగర్ తరలించాడు. తర్వాత మ్యాన్‌హోల్‌లోకి తోసేసి దాన్ని కాంక్రీట్‌తో పూడ్చేశాడు. ఏమీ తెలియనట్టు ఈ నెల 5న శంషాబాద్ ఠాణాలో అప్సర కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఒకదశలో సాయికృష్ణ పొంతన లేని మాటలకు వారికి అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. దీంతో నిందితుడు నేరాన్నిఅంగీకరించడంతో అసలు సంగతి బయటకొచ్చింది.