Page Loader
మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత
మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత

మధ్యప్రదేశ్: గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి ఇల్లు కూల్చివేత

వ్రాసిన వారు Stalin
Jul 05, 2023
06:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేసింది. ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్‌గా మారడంతో మంగళవారం అర్థరాత్రి అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రవేశ్ ఇంటి వద్దకు బుధవారం పదుల సంఖ్యలో అధికారులు వెళ్లి, అతని ఇంటిని బుల్డోజర్‌తో కూల్చివేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రవేశ్ మానవత్వాన్ని మరిచాడన్నారు. అమానవీయ చర్యకు పాల్పడినట్లు సీఎం పేర్కొన్నారు. దీనికి కఠినమైన శిక్ష కూడా సరిపోదన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తాను ఆదేశాలు ఇచ్చానని సీఎం చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిందితుడు ప్రవేశ్ ఇంటిని కూల్చివేస్తున్న దృశ్యం