హింసాకాండ నేపథ్యంలో.. మణిపూర్‌ను 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించిన ప్రభుత్వం
శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రం మొత్తాన్ని '' 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించింది. 19 నిర్దిష్ట పోలీస్ స్టేషన్ ప్రాంతాలను మినహాయించి రాష్ట్రం మొత్తాన్ని 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించారు. మణిపూర్ రాష్ట్రంలో వివిధ తిరుగుబాటు గ్రూపుల హింసాత్మక కార్యకలాపాలు అనిణిచివేసందుకు, పౌర పరిపాలన కోసం సాయుధ బలగాలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇంఫాల్, లాంఫెల్, సిటీ, సింగ్‌జమీ, సెక్‌మై, లామ్‌సాంగ్, పట్సోయ్, వాంగోయ్, పోరోంపట్, హీంగాంగ్, లామ్‌లై, ఇరిల్‌బంగ్, లీమాఖోంగ్, తౌబల్, బిష్ణుపూర్, నంబోల్, మొయిరాంగ్, కక్చింగ్ మరియు జిరిబామ్ ప్రాంతాలను కలిపి ప్రభుత్వం 'డిస్టర్బ్ ఏరియా'గా ప్రకటించింది.