Manipur: మణిపూర్‌లో బుల్లెట్ గాయాలతో రెండు మృతదేహాలు లభ్యం
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాలలో బుల్లెట్ గాయాలతో ఒక మహిళతో సహా రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని తైరెన్‌పోక్పి ప్రాంతంలో బుధవారం తలపై బుల్లెట్ గాయంతో మధ్య వయస్కురాలైన మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసు అధికారి తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు.
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని తఖోక్ మాపాల్ మఖా ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నలభై ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహం లభ్యమైందని మరో అధికారి తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Details
మృతుడు కళ్లకు గంతలు కట్టి, వెనుకకు చేతులు కట్టి,
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కళ్లకు గంతలు కట్టి, వెనుకకు చేతులు కట్టి, తలపై బుల్లెట్ గాయాలతో కనిపించాడు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమ్మితం ఇంఫాల్ ఈస్ట్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు పంపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని అధికారి తెలిపారు.
ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని కంగ్‌చుప్ పర్వత ప్రాంతాల నుండి ఇటీవల "గుర్తించబడని వ్యక్తులు అపహరించిన" నలుగురు తప్పిపోయిన వ్యక్తులలో మరణించిన మహిళ ఒకరిగా భావిస్తున్నట్లు మరొక అధికారి తెలిపారు.
వేరే కమ్యూనిటీకి చెందిన గుర్తుతెలియని వ్యక్తులు మెయిటీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో ఆందోళన చెంది, వారి గురించి తెలుసుకోవడానికి ఫాయెంగ్‌కు చెందిన మహిళలతో సహా పెద్ద సమూహం కాంగ్‌చుప్ కొండపైకి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Details
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలలో 80 మందికి పైగా మృతి
మంగళవారం కంగ్‌చుప్ పాదాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ఇద్దరు మణిపూర్ పోలీసు సిబ్బంది, ఒక మహిళతో సహా కనీసం తొమ్మిది మందికి బుల్లెట్ గాయాలయ్యాయి.
మేలో మొదటిసారిగా జాతి ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు పునరావృతమవుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 180 మందికి పైగా చనిపోయారు.
మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వారు ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. నాగాలు,కుకీలను కలిగి ఉన్న గిరిజనులు 40 శాతం ఉన్నారు.వీరు ప్రధానంగా కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.