
Eluru: ఏపీలో మరో దారుణం.. భర్తను చితకొట్టి, భార్యపై అత్యాచారం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్తను చితకొట్టి, అతని భార్యపై ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఏలూరులో సంచలనంగా మారింది.
మూడు పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి, అతని రెండో భార్య ఏలూరు వన్‌టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటున్నారు.
ఈ క్రమంలో ఈ జంటకి జులాయిగా తిరిగే ముగ్గురు యువకులు పరిచయమ్యారు.
Details
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు
శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు, విజయరాయికి కలిసి మద్యం తాగారు. పక్కనే అతని భార్య నిద్రిస్తోంది. మద్యం మత్తులో ముగ్గురు యువకులు అతడిపై దాడి చేశారు.
అనంతరం పక్కనే నిద్రిస్తున్న అతని భార్యను కొద్ది దూరం లాక్కెళ్లి అత్యాచారం చేశారు.
ఆమె భర్త కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న ఓ యువకుడు రావడంతో ఆ ముగ్గురు నిందితులు పరారయ్యారు.
బాధితుల ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.