Loading...
Visakhapatnam: హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడిన విశాఖ
హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడిన విశాఖ

Visakhapatnam: హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడిన విశాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిఫైనరీ ప్రాంగణం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన నల్లటి పొగ వ్యాపించింది. ఈ ఘటనతో విశాఖ నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

వివరాలు 

భయాందోళనలో స్థానికులు

రిఫైనరీ నుంచి ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగను చూసి సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే హెచ్‌పీసీఎల్‌ అంతర్గత భద్రతా విభాగం (సేఫ్టీ వింగ్) సిబ్బంది అప్రమత్తమయ్యారు.

యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.

వివరాలు 

పేలుడు కారణంగానే ప్రమాదమా?

రిఫైనరీలో ఏదైనా పేలుడు సంభవించడం వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

అయితే, ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన ఆస్తి నష్టంపై కూడా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించారు.

ADVERTISEMENT