
Telangana: ఆర్టీసీలో భారీగా ఉద్యోగ నియామకాలు.. త్వరలోనే 3,038 పోస్టులకు నోటిఫికేషన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందింది.
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 3,038 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు.
ఈ నియామకాల్లో 2,000 డ్రైవర్ పోస్టులు ఉండగా 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉండనున్నాయని తెలిపారు.
అంతేకాకుండా వివిధ స్థాయిల్లో ఉన్నత హోదాలో గల పోస్టుల కోసం కూడా భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Details
ఏ ఏ పోస్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) - 84 పోస్టులు
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) - 114 పోస్టులు
డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ - 25 పోస్టులు
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ - 18 పోస్టులు
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) - 23 పోస్టులు
సెక్షన్ ఆఫీసర్ (సివిల్) - 11 పోస్టులు
అకౌంట్స్ ఆఫీసర్ - 6 పోస్టులు
మెడికల్ ఆఫీసర్ (జనరల్) - 7 పోస్టులు
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) - 7 పోస్టులు
ఇలా మొత్తంగా 3,038 పోస్టులు త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నోటిఫికేషన్‌తో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు బాగానే మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.