
Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది.
ఫిబ్రవరి 18నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసింది.
మేడారం వచ్చే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, రద్దీని నియంత్రించడమే కాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం 14వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసింది.
ఐజీ డాక్టర్ తరుణ్ జోషి మహాజాతరకు సంబంధించిన భద్రతపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
20మంది ఎస్పీలు, 42మంది ఏఎస్పీలు, 140మంది డీఎస్పీలు, 400మంది సీఐలు, 1000మంది ఎస్సైలు, దాదాపు 12వేల మంది కానిస్టేబుళ్లకు మేడార జాతర విధుల్లో పాల్గొంటున్నారు.
మేడారం
500లకు పైగా సీసీ కెమెరాల ఏర్పాటు
మేడారం జాతరకు కొన్ని లక్షల మందికి రానున్న నేపథ్యంలో రద్దీని అదుపు చేయడం పోలీసులకు కత్తిమీద సాములాంటిదే.
అయితే.. మేడారం జాతరపై నిఘా ఉంటేందుకు పోలీసుల మోహరింపుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసారు.
పరిసరాల్లో మొత్తం 500లకు పైగా సీసీ కెమెరాలను చేసినట్లు పోలీసులు తెలిపారు.
కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి జాతరను నిరంతరం పర్యవేక్షించనున్నట్లు ములుగు ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, సమ్మక్-సారలమ్మను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రముఖులు రానున్నారు.
దర్శనం కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జారత పరిసరాల నిరంతర పరిశుభ్రత కోసం 4,000మంది పారిశుధ్య కార్మికులను నియమించారు. 14క్లస్టర్లలో 5,532మరుగుదొడ్లు, 230 కొత్త బోర్‌వెల్‌ల కూడా ఏర్పాటు చేశామన్నారు.