
Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీపై డ్యాం సేప్టీ సంచలన నివేదిక.. మళ్లీ కొత్తగా కట్టాల్సిందేనట
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ కుంగిపోవటంపై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ (NDSA) సంచలన నివేదిక బహిర్గతం చేసింది.
ప్లానింగ్, డిజైన్,క్వాలీటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో వైఫల్యం వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందనే నిర్దారణకు వచ్చినట్లు వెల్లడించింది.
బ్యారేజ్ ఫెయిలైన కారణంగా ప్రజా జీవితానికి, ఆర్దిక వ్యవస్థకు పెను ముప్పు అని అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీని వినియోగించే అవకాశం లేదని నివేదకలో తేల్చేసింది.
ఈ మేరకు బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ సరైన రీతిలో లేదని స్పష్టం చేసింది.మొత్తం బ్యారేజీని పునాదుల నుంచి తొలగించి మళ్లీ కొత్తగా నిర్మించాలని కుండబద్దలు కొట్టింది.
అటు అన్నారం,సుందిళ్ల బ్యారేజీలు ఇలాంటి ముప్పు బారిన పడే అవకాశముందని హెచ్చరించింది.
details
నిర్లక్ష్యం కారణంగా బ్యారేజీ క్రమేపీ బలహీనమైపోయింది : NDSA
డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బ్యారేజీ క్రమేపీ బలహీనమైపోయిందని నివేదికలో పొందుపర్చింది.
ఇదే సమయంలో బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, బేస్ మెంట్ మెటీరియల్ నాణ్యతలేమీ, సామర్థ్యత లేమీగా ఉన్నాయని చెప్పింది.
బ్యారేజీ లోడ్ వల్ల ఎగువ ప్రాంతంలోని కాంక్రీట్ పైల్స్ బలహీన పడి పిల్లర్స్ సపోర్డ్ కుంగిపోయిందని నివేదికలో రాసుకొచ్చింది.
మరోవైపు కమిటీ కోరిన వివరాలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదని, 20 అంశాలు అడిగితే కేవలం 12 మాత్రమే చెప్పినట్లు నివేదికలో వివరించింది.
పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడమే కారణమని NDSA తెలిపింది. ప్రస్తుత దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజీ మరింత కుంగిపోయే ప్రమాదం ఉందని నివేదిక ద్వారా తెల్చేసింది.